ఈ “స్పెక్టర్” బాండ్ చురుకే …

https://i0.wp.com/www.wallpaperup.com/uploads/wallpapers/2015/07/24/762669/big_thumb_9a1121fed3092bc40cac62e3ca43cbdb.jpg

జేమ్స్ బాండ్(డేనియల్ క్రేగ్) గూడచారి సినిమాల్లో ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ,చురుకైన గూడచారి ,దేశ రక్షణకోసం ప్రాణం తియ్యటానికి కూడా వెనుకాడడని తెగింపు ,అందాల భామల తో సయ్యాట ,వింత వింత వాహణాలు ఇతని సొంతం ,అర్ధ శతాబ్ది పైగా అలుపెరగకుండా మనల్ని అలరిస్తున్న ఈ బాండ్ ,గత స్కై ఫాల్ చిత్రంలో కొంచం నీరసించాడు ,మరి ఈ చిత్రంలో తన స్థాయి వినోదాన్ని అలరించాడా ,అసలు ఈ సారి బాండ్ లక్ష్యం ఏమిటి అనేది చూద్దామా ?

జేమ్స్ బాండ్ 007 పరిచయం అక్కర్లేని ఒక ప్రముఖ గూడచారి ,అయితే “C” అనే వ్యక్తి బాండ్ పని చేసే 00 సంస్థను మూసెయ్యాలి ,తనకు హోం శాఖలో గల పరిచయాలతో సంస్థలో ప్రవేశించి ,ఆ సంస్థ ఇప్పటి తరానికి అవసరం లేదు అని మూయించే ప్రయత్నం చేస్తాడు ,ఈ లోపల మెక్సికోలో స్టేడియంని పేల్చే కుట్రని బాండ్ చేధించి,సైరా అనే ఉగ్రవాదిని హతమారుస్తాడు ,సైరా దగ్గర దొరికిన ఒక ఉంగరం ఆధారంగా రోమ్ కి ప్రయాణించి సైరా భార్య సహకారంతో,స్టేడియం పేల్చివేత కుట్రను పన్నింది “స్పెక్టర్” అనే సంస్థగా గుర్తిస్తాడు బాండ్ ,ఆ తర్వాత ఆస్ట్రియాలో mr.వైట్ ద్వారా కొన్ని నిజాలు తెల్సుకుని ,ప్రతిగా అజ్ఞాతంలో ఉన్న అతని కూతురు మ్యాడలిన్ స్వాన్ని(లీ సైడోక్స్)   రక్షించే భాద్యత తీస్కుంటాడు బాండ్ …

మరి చివరికి స్వాన్ ని బాండ్ రక్షించగలుగుతాడా ? స్పెక్టర్ సంస్థను అతను భూస్థాపితం చేయగలుగుతాడా ? “C” కుట్రను చేదించి “00” సంస్థను  నిలబెట్టుకోగలుగుతాడా ? అనేది మిగతా కథ …

కథ బాగుంది ,కొన్ని సంఘటనల సమాహారంగా అంతర్జాతీయ ఉగ్రవాదులను పట్టుకోవడం,కొంత మంది మనుషుల స్వార్ధం ,అంతర్జాతీయ నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో చక్కగా చూపించారు ,ప్రథమార్ధం అంతా చురుగ్గా గడుస్తుంది ,సినిమా ప్రారంభం నుంచే కథలో పడిపోవడం వల్ల కొంచెం ప్రేక్షకుడు ఇబ్బంది పెట్టేదే అయినా ,పోరాట సన్నివేశాలు ఆ లోటుని తెలియనివ్వలేదు ,ద్వితీయార్ధం మాత్రం ఎందుకో స్వాన్ తో సున్నితమైన ప్రేమకథను ఎత్తుకున్నాడు దర్శకుడు ,ఇది బాండ్ చిత్రాల్లో కొంచెం ఇబ్బంది పెట్టేదే ,సినిమా నిడివిని ఈ ప్రేమ సన్నివేశాలతో పెంచేసాడు దర్శకుడు …

డ్యానియల్ క్రేగ్ నటన బాగుంది ,గత చిత్రాల్లో కన్నా చాలా హుషారుగా చేసాడు …

లీ సైడోక్స్ నటన ,అందం రెండూ బాగున్నాయి …

Ernst Stavro Blofeld(ప్రతినాయకుడు) గా చేసిన chirstoph waltz  పాత్ర ,అతని నటన రెండూ కూడా కృత్రిమంగా అనిపించాయి ..

దర్శకుడు సాం మెండిస్ స్కై ఫాల్ చిత్రం నుంచి పాఠాలు బాగానే నేర్చుకున్నాడు అనిపించింది ,సినిమాల్లో కొంచం హుషారు ఉంది ,విభిన్న ప్రదేశాల్లో చిత్రీకరణ ,ముఖ్యంగా పోరాట సన్నివేశాలు ఆకట్టుకున్నాయి ,నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ప్రతి సన్నివేశం వర్ణరంజితం చేసారు …

చాయాగ్రహణం ,పోరాట సన్నివేశాలు అద్భుతం …

సినిమా బాగుంది కానీ నిడివి తగ్గ్గించి ఉంటె బాగుండేది ,ద్వితీయార్ధంలో ఈ నిడివి సమస్య కొట్టొచ్చినట్లు కనిపించింది …

మొత్తం మీద చెప్పాలంటే ,బాండ్ చిత్రాలను ఇష్టపడే వారు తప్పక చూడదగ్గ చిత్రం(కుటుంబ సమేతంగా 🙂 ) ఈ “స్పెక్టర్”…

కొస మెరుపు : ఈ సారి ఎందుకో సెన్సార్ బోర్డు వారు బాండ్ మీద తమ కత్తెర పదును గట్టిగా చూపించారు  ,బాండ్ మార్కు ముద్దులకు భారీగా కత్తెర వేసేసారు ,ఇది బాండ్ అభిమానులను నిరాశ పరిచే అంశం .. బాలీవుడ్ చిత్రాల్లో విచ్చల విడి తనాన్ని చూసీ చూడకుండా వదిలేస్తున్న బోర్డు ఒక హాలీవుడ్ చిత్రం మీద పడడం ఆశ్చర్యపరిచే అంశం ..

వ్యాఖ్యానించండి