“రాజు గారి గది”లో బూచి …

raju gari gadhi

భయం ,ఇది సాధారణ ప్రజలకి నష్టం ,సినీ నిర్మాతలకు మాత్రం కాసుల వర్షం … భయపడుతూనే ఒక విధమైన వినోదాన్ని అందించడం “ప్రేమ కథా చిత్రం” అందిస్తే ,ఇపుడు అదే బాటలో చాలా మంది దర్శకులు సాగుతున్నారు ,అలాంటి ఒక హాస్య భరిత “భయానక చిత్రమే ” ఈ “రాజు గారి గది “…

అనగనగా నందిగామ అనే ఊర్లో ఒక రాజ మహల్ ,అక్కడ జరుగుతున్న అంతుచిక్కని హత్యలు ,ఆ రాజమహల్ లో ఉన్న దెయ్యమే చేస్తుందని కథలు కథలుగా చెప్పుకుంటుంటారు జనం ,ఈ హడావుడిని తమ ఛానెల్ రేటింగ్ పెంచుకోవడానికి వాడుకోవాలని ,మా టీవీ అధికారులు ఒక పథకం వేస్తారు ,దాని ప్రకారం ఒక రియాల్టీ షో పెట్టి ,అందులో 7 మంది యువతీ యువకులను ఎన్నుకుంటారు ,వారు ఆ రాజ మహల్ కి వెళ్లి ,అక్కడ దెయ్యం ఉందొ లేదో తెలియచెప్పాలి ,అలా చేసిన వారికి 3 కోట్ల బహుమతి ,ఈ బృందం రాజమహల్ కి చేరగానే కొన్ని భయానక సంఘటనలు జరుగుతాయి ,అనూహ్యంగా ఆ బృందంలో శివుడు (ధనరాజ్) చంపబదతాడు ,మరి ఆ బృందంలో మిగిలిన ఆరుగురు దెయ్యం చేతిలో మరనిస్తారా ,లేదంటే ఆ మహల్ రహస్యాన్ని చేదించి ,బహుమతి మొత్తాన్ని గెలుచుకుంటారా అనేది మిగతా కథ …

ప్రథమార్ధం కథ ప్రారంభించిన తీరు బాగుంది ,కాకపొతే ఒక్క రియాలిటీ షో మినహా చిన్నప్పటి నుంచి చూస్తున్న దెయ్యం సినిమాల సన్నివేశాలు ఒక్కొక్కటిగా దర్శనం ఇస్తాయి ఈ రాజు గారి గదిలో .. 😉  భయం కన్నా వినోదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వాళ్ళ సగటు ప్రేక్షకుడు సుఖంగా చూడగలుగుతాడు  ప్రథమార్ధాన్ని,విశ్రాంతి సమయానికి దెయ్యం యొక్క చరిత్ర చెప్పి ,ఇలా ఇలా అని చెప్పేసరికి,ద్వితీయార్ధాన్ని అరుంధతి స్థాయిలో ఊహించేస్తాం మన లాంటి ప్రేక్షకులం …

అయితే ద్వితీయార్ధం మాత్రం శివుడు హత్యతో ప్రారంభం అవుతుంది ,కాకపోతే ఆ బొమ్మాలి దెయ్యం వేసే వేషాలు (పవన్ కళ్యాణ్ ఫోటో ని చూసి మురిసిపోవడం లాంటివి ) అంతే కాదు ,దెయ్యం మొహం లో కూడా భయానకం కన్నా హాస్యాన్నే ఎక్కువ పండించే ప్రయత్నం చేసారు ,ప్రథమార్ధంలో రాజీవ్ కనకాల ని చూపింఛి ,అవయువ దానం గురించి చెప్పగానే ఒక సాధారణ ప్రేక్షకుడు ఎవరైనా పతాక సన్నివేశం (క్లైమాక్స్) ని ఊహించేస్కోగలరు ,చివరికి ఒక ప్రతీకారం నెరవేరగానే సినిమా హాల్లో లైట్లు వేసేస్తారు …

నటీ నటుల గురించి చెప్పుకోవాలంటే :

అశ్విన్ బాబు : 

ashwin-babu-20150918132307-35620

కేవలం దర్శకుడి తమ్ముడు అవ్వడం వల్లనే ఇతనికి హీరో పాత్ర ఇచ్చేసారేమో అనిపించింది ,ముఖంలో పెద్దగా హావభావాలు కనిపించలేదు ,ఎదో అలా అలా చేసేసాడు …

ధన్యా బాలకృష్ణన్ :

Raju-Gari-Gadi-Movie-Stills-19

చూడడానికి బాగుంది ఈమె ,అయితే ఈమెకు తెలంగాణా యాసలో డబ్బింగ్ చెప్పించాలని ఎందుకు అనిపించిందో ,దర్శకుడికే తెలియాలి ,నటన పరంగా బాగా చేసింది ధన్య..

విద్యులేఖా రామన్ :

vid

ఈమె శరీర తత్వానికి మంచి హాస్యమే పండింది ,అయితే దర్శకుడు ఈమెతో సొంత గాత్రంలో డబ్బింగ్ చెప్పించడంతో కొన్ని సంభాషణలు సాధారణ ప్రేక్షకుడికి అర్ధం కావు ..

షకలక శంకర్ :

shakalaka

ఇతని నటన,హావభావాలు కడుపుబ్బ నవ్వించాయి ,అయితే ఈ జబర్దస్ట్ బృందం ఇంకా వాళ్ళ ఎబ్బెట్టు హాస్యాన్ని చాల చోట్ల తగ్గించుకుంటే మంచిది …

ధనరాజ్ :

Raju Gari Gadhi Telugu Movie Stills

ధనరాజ్ నటన ,హావభావాలు ,హాస్యం బాగున్నాయి ,ముఖ్యంగా ఇతను ,షకలక శంకర్ ఈ సినిమాను భుజాల మీద మోశారు అని చెప్పుకోవాలి …

చీతన్ చీను :

Chetan Cheenu Interview

ఇతగాడు క్రొత్త నటుడే అయినా ,ప్రతికూల పాత్రలో చాల చక్కగా చేసాడు అనే చెప్పాలి ,అయితే పతాక సన్నివేశాల్లో ఇతని నటన తేలిపోయింది ..

ఇక ఆ బార్బీ పాత్ర చేసిన అమ్మాయి ఎవరో కాని ,కేవలం అందాలు చూపించడానికే తెచ్చారని అనుకోవాలి ,నటన అబ్బే సూన్యం  😛

poorna

పూర్ణ ఇప్పటి వరకు చేసిన పాత్రలు అన్నిట్లో,ఈ సినిమాలో  మాత్రమే  చాల పేలవమైన నటన ప్రదర్శించింది ..

టీవీ ఛానెల్ అధికారులుగా రఘుబాబు ,ప్రభాస్ శ్రీను నటన ,నవ్వించింది

సాయిమాధవ్ బుర్రా మాటలు ,కార్తీక్ సంగీతంలో పాటలు పర్లేదు ..

ఇక చివరిగా  ఓంకార్ ,కడుపుబ్బ నవ్వించారు ,అయితే కథలో ముఖ్యమైన హారర్ అంశాన్ని పక్కన పెట్టేసి ,దెయ్యంతో కూడా హాస్యం చేయించి ,విసిగించారు ,కాకపోతే ఇపుడు ఈ రకం హాస్యాన్ని జనాలు(కుటుంబ ప్రేక్షకులతో సహా) చూస్తున్నారు గనుక పర్లేదు ,ఈయన పంట పండినట్లే …

చివరిగా కథలో విషయం లేదు ,కాకపోతే ఒక 2గంటల 20 చక్కగా నవ్వుకోవాలంటే మాత్రమే ఈ “రాజు గారి గది” లోకి అడుగు పెట్టొచ్చు …

కొసమెరుపు : నందిగామలో ఉన్న రాజమహల్ లోకి వెళ్ళడానికి హైదరాబాద్ పోలీసు కమీషనర్ అనుమతి ఇవ్వడం ఏంటో ,ఓంకార్ గారు అద్బుతం సార్ మీరు … 😛

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s