” చీకటి రాజ్యం” లో చిరుత వేట …

“కమల్ హాసన్” ఈ పేరు దక్షిణాదిలోనే కాదు “భారతీయ” చలనచిత్ర పరిశ్రమలోనే ఒక సంచలనం. నటన,సినిమా అంటే ప్రాణం పెట్టే అతి కొద్ది నటుల్లో కమల్ ఒకరంటే అతిశయోక్తి కాదు.. అటువంటి కమల్ హాసన్ నుంచి ఒక చిత్రం అందులోను యాక్షన్ నేపధ్యం ఉన్న సినిమా వస్తుందంటే అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి ,మరి వారి అంచనాలను ఈ చీకటి రాజ్యం వెలుగుల్ని నింపిందా?

కథ విషయానికి వస్తే దివాకర్(కమల్ హాసన్) నార్కోటిక్స్(మాదకద్రవ్య నిరోధక విభాగం) లో ఒక అధికారి ,దివాకర్ భార్య (ఆశా) అతని నిజాయతీ తో పొసగక విడాకులు తీసుకుంటుంది,కొడుకు మాత్రం ఇద్దరి దగ్గర ఉంటుంటాడు ,మధు అనే ఒక అధికారితో చేసిన ఆపరేషన్లో కొకైన్ స్వాధీనం చేసుకుని అమ్మేయ్యాలి అని పధకం వేస్తాడు దివాకర్ ,ఈ విషయం తెల్సిపోయి స్మగ్లర్ విఠల్ రావ్  దివాకర్ కొడుకుని అపహరిస్తాడు ,తన కొకైన్ తిరిగి తన పబ్ కి తెచ్చి ఇస్తే తప్ప కొడుకుని వదలను అని షరతు పెడతాడు ,ఈ విషయం తెలియని ఇద్దరు అధికారులు మదన్ (కిషోర్),మోహిని (త్రిష) దివాకర్ వెంటపడతారు ,అసలు  నిజాయతీ పరుడైన దివాకర్ కొకైన్ ఎందుకు అపహరించాడు ,చివరికి తన కొడుకుని కాపడుకోగలుగుతాడా ?అనేది మిగతా కథ

ప్రథమార్ధం సరాసరి కథలోకి తీసుకుపోతాడు దర్శకుడు ,క్షణం తీరిక లేని ఒక అధికారి ,విడాకులు తీస్కున్న భార్య ,తండ్రి కోసం తపించే కొడుకు వీటి అన్నిట్ని ఒక్క ముక్కలో చూపించేసి సరాసరి అసలు కథలోకి తీస్కుని వెళ్ళిపోయాడు దర్శకుడు ,ప్రథమార్ధం నుంచి మొత్తం ఇలా పబ్ లోనే గడిచిపోతుంది ,సూటిగా మాట్లాడు సుత్తి లేకుండా అన్న చందంగా కథ ఉరుకులు పరుగులు మీద సాగుతుంది ,అయితే ఒకే పబ్ లో కథ నడపడం వల్ల కొంచెం విసుగు అనిపించినా ,ప్రతి పాత్రను ప్రత్యేకంగా చెక్కడం వల్ల గజిబిజి లేకుండా సాగింది.

ద్వితీయార్ధం మాత్రం కొంచం చురుగ్గా సాగింది … అయితే కథానాయకుడికి ఒక గాయం ,దానితో అతను పడే ఇబ్బంది సగటు ప్రేక్షకుడు జీర్ణించుకోలేని వ్యవహారమే ,ఇక త్రిష ,కమల్ మధ్యన పోరాట సన్నివేశం సహజంగానే ఉన్నా ఒళ్ళు గగుర్పోడిచేలా తీసారు..

కమలహాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ,ఒక నిజాయతీ గల అధికారిగా ,కొడుకు కోసం పరితపించే తండ్రిగా విలక్షణమైన పాత్రను ఆవలీలగా చేసేసారు ..

ఇక అవినీతి వ్యాపారం చేసే పబ్ యజుమానిగా ప్రకాష్ రాజ్ నటన బాగుంది ,మరో మంచి నటుడు సంపత్ కూడా ప్రకాష్ రాజ్ బాగస్వామిగా పోటీ పడి నటించారు ..

ఇక మరో నటుడు కిషోర్ కూడా అవినీతి పరుడైన అధికారిగా చక్కగా నటించారు…

ఇక కధానాయిక త్రిష మొదటి నుంచి చివరి దాకా కమల్ ని వెంటాడే పాత్రలో చక్కగా నటించింది ,కొంచం వయసు అయినట్లు కనిపించినా ఈ పాత్రకు చక్కటి ఎంపికే..

ఇక మధుశాలిని కి ఒక పెద్ద హీరో పక్కన మంచి అవకాశమే దక్కింది అనుకోవాలి ,కానీ ఈ పాత్రను కేవలం ముద్దుల కోసమే సృష్టించడంలో ఆంతర్యం దర్శకుడికే తెలియాలి 😉

ఇక కమల కొడుకుగా నటించిన బాల నటుడు చాల చక్కగా నటించాడు ,తండ్రి ప్రేమ కోసం ,తను ఎందుకు అపహరణకు గురయ్యదో తెలియక పరితపించే పాత్రలో జీవించాడు…
ఇక కిడ్నాప్ కి గురైన కుర్రవాడికి  కాపలా కాసే యువకుడిగా జగన్ నటన కుడా బాగుంది..

దర్శకుడు రాజేష్ m సెల్వా చక్కటి కథను ఎంచుకున్నారు ,మొదటి నుంచి చివరిదాకా పులి మేక ఆటలా సాగే కథలో మంచి పట్టు ఉంది ,అయితే పేరుకు తగ్గట్లు గానే కథ మొత్తం చీకటైన పబ్ లోనే గడవడం తో ,సగటు ప్రేక్షకుడు కొంచం అసహనానికి గురవుతాడు ,కాకపోతే పతాక సన్నివేశాలకి చేరేసరికి ఈ లోటు తీరి కొంచం వెలుగులో పడుతుంది కథ .. మొత్తం మీద కొంచెం వినోదం పడితే బాగుండేది అనుకుంటాడు సగటు ప్రేక్షకుడు …

జీబ్రాన్ సంగీతంలో పెద్దగా పాటలు లేకపోయినా ,నేపధ్యం ప్రతి సన్నివేశాన్ని పండించింది ,ముఖ్యంగా ద్వితీయార్ధంలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది ,ఒక హాలీవుడ్ స్తాయి చిత్రానికి ఇవ్వదగ్గ సంగీతం ఇది …
పోరాటాలు బాగున్నాయి ,ప్రతి ఫైట్ ఎంతో శ్రద్ధతో తీసారు అనిపించింది..
 మొత్తం మీద చెప్పాలంటే దర్శకుడు ఎక్కడా నీటి సూత్రాల జోలికి పోకుండా చక్కగా కథని నడిపారు ,సినిమాలో వినోదం లోపించడం ఒక ప్రతికూల అంశమే అయినా కూడా ,చురుకైన కథనం ,చక్కటి నటులు ,వారి అభినయం కోసం తప్పక చూడదగ్గ చిత్రం ఈ “చీకటి రాజ్యం “

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s