ఓతల్లి ప్రేమ ,పగ,ఒక కాపాడే నీడ “మయూరి “…

https://i2.wp.com/moviearts.in/wp-content/uploads/2015/09/Nayantara-Mayuri-Telugu-Movie-Review-Ratings.jpg

భయానక సినిమాలంటే సాధారణంగా ప్రేతాత్మలు ,అవి మామూలు మనుషుల్ని పెట్టే హింసలు ,చివరికి చెడు మీద మంచి విజయం ఇలా ఉండాలని 80 వ దశకంలో దర్శకులు ఒక ఫార్ములా రాసిపెట్టారా అనిపించేది ,,కానీ యువతరం దర్శకుల రంగప్రవేశం ఈ తరహాని మార్చినట్లే అనిపించింది ,పిజ్జా లాంటి చిత్రాలు చూసాకా ,మరి ఈ మయూరి చిత్రం భయపెట్టిందా ,లేదంటే అస్థిపంజరాలు ,నిమ్మకాయలు అంటూ భయపెడుతుందా ?

కథ విషయానికి వస్తే మయూరి (నయనతార) ప్రముఖ కథానాయకుడు అర్జున్ (అరి) భార్య ,భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా గర్భంతో ఉన్న భార్యని వదిలేసి వెళ్ళిపోతాడు అర్జున్ ,బిడ్డ పెంపకం కోసం అప్పుల పాలు అవుతుంది ,తన బిడ్డతో సహా సహాయ దర్శకురాలు అయిన తన స్నేహితురాలు అయిన స్వాతి పంచకు చేరుతుంది ,సినిమా ప్రయత్నంలో భాగంగా RK అనే దర్శకుడు తీయబోయే తదుపరి చిత్రంలో ఎంపిక అవుతుంది ,,అయితే అప్పుల బాధలు శ్రుతి మించడంతో RK పెట్టిన ఒక వింత పోటీకి ఒప్పుకుంటుంది ,అది ఏంటంటే అతను ఎంతో కష్టపడి తీసి విడుదలకు నోచుకుని “చీకటి ” అనే సినిమాను ఏ మాత్రం భయపడకుండా ఒంటరిగా చూడాలి ,అయితే అంతకు ముందు రోజే ఆ సినిమాను చూస్తూ ఒక వ్యక్తి అనూహ్యంగా చనిపోతాడు ,ఇక నయనతార ఈ సినిమాను చూస్తూ ఎటువంటి భయానక అనుభవాలు పొందింది ,ఆమె కస్టాలు గట్టెంచుకోగల్గుతుందా? అనేది మిగతా కథ …

కథ మన చిన్నప్పుడు అమ్మమ్మలు ,తాతయ్యలు చెప్పిన కథలు మాదిరిగా మొదలుపెట్టారు ,అనగనగా ఒక అడివి ,అందులో ఒక బూచాడు ఆ మాదిరిగా ,నగరానికి 13 కిలోమీటర్ల దూరంలో మాయావనం అనే అడివి ,ఆ అడవి మీద భయంకరమైన కథలు ప్రచారంలో ఉంటాయి ,మరి ఆ అడవి ,అందులో ఒక దెయ్యం ,దాని మీద ఒక సినిమా ,ఆ సినిమాకి మయూరికి ఉన్న సంబంధం,పాప మీద ప్రేమ ,ఇలా చాలా అంశాలు కలుపుకుని ఒక కథ అల్లుకున్నారు దర్శకుడు అశ్విన్ ,ప్రథమార్ధం  మొదటి నుంచి భయపెట్టడం ,నయనతార కష్టాలు,చీకటి సినిమా ఇలా సాగదీసారు ,ద్వితీయార్ధంలో నయనతార సినిమా చూడడం అనే సవాల్ కి వచ్చినపటి నుంచి కొంత గందరగోళం మొదలవుతుంది ,పతాక సన్నివేశానికి కొద్ది ముందు ఇచ్చే వివరణతో ప్రేక్షకుడు పూర్తిగా ఏకీభవించలేడు కానీ ,సాంకేతికత,తల్లి ప్రేమ వంటి అంశాల  వల్ల విసుగు భావించడు…

సినిమాలో ముఖ్యంగా మాట్లడుకోవల్సింది “నయనతార” గురించే ,అనుభవజ్ఞురాలిన నటి కావడంతో ఈ పాత్ర అవలీలగా చేసేసారు ఈమె ,భర్త నుంచి విడిపోయిన ఒక సాధారణ గ్రుహిణిగా,ఇంకా భయంకరమైన భావోద్వేగాలు ఎదుర్కునే కలో నిజమో అర్ధం కాని ఒక పరిస్థితిలో ,ఈమె తప్ప నేటి తరం నటులు ఇలాంటి పాత్ర ఎంత మంది చేయగలరు అనేది సందేహమే …

ఆరి చూడడానికి ఎంత బాగున్నాడో ,అంత బాగా నటించారు …

ఇక నయనతార స్నేహితురాలి పాత్ర ,దర్శకుడు RK పాత్రధారి ఇలా అందరూ కొత్తవారే అయిన ,వారి వారి పాత్రల్లో జీవించారు …

24 ఏళ్ళ అశ్విన్ శరవణన్ రాసుకున్న కథ బాగుంది ,అయితే చాలా అంశాలు చూపించేయాలి అనే తాపత్రయంలో తత్తరపడ్డాడేమో అనిపించింది ,సినిమా వ్యవహారం ,మయూరి ఆమె సంసార సమస్య ,మాయావనం,మధ్యలో దర్శకుడు RK ఇలా అన్నీ చూపించెయ్యాలి అని బేసిక్ అంశాలను వదిలేసారు ,ముఖ్యంగా మాయవనానికి సంబంధించిన అంశాలు సాధారణ ప్రేక్షకుడికి అర్ధం కానివి ,కాకపోతే శబ్ద గ్రహణం ,నేపధ్య సంగీతం ,తల్లి ప్రేమ కి సంబంధించిన అంశాలు ,ప్రేక్షకులను భయపెట్టడంలో కృతకృత్యులు అయ్యాడు …మొత్తం మీద ప్రేక్షకులను భయపెట్టాడు ,తల్లి ప్రేమ ఎప్పటికి బిడ్డని వీడిపోదు అనే మంచి అంశాన్ని వదిలిపెట్టలేదు ,మొత్తం మీద కొంచం ఓపికగా చూస్తే(సినిమా నిడివిని తగ్గిస్తే ) తప్పక చూడాల్సిన మంచి చిత్రం ఈ “మయూరి “….

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s