వినాయకునికేల ఈ వికారాలు ?

శాస్త్ర ప్రకారం వినాయక చవితి నాడు పూజించాల్సిన  వినాయకుడికి ఉండాల్సినవి ఇవి

  • చతుర్భుజాలు
  • పాశము
  • అంకుశము
  • మోదకము
  • దంతము
  • అభయ/వరద  హస్తములు

మరి నేను చూసిన కొన్ని రకాల వినాయకులు ,వాటిని దేవతా మూర్తులుగా ఎలా పూజిస్తున్నారో ,ఆ పైత్యాన్ని ఏమనాలో ,దాన్ని మనం ఎలా అంగీకరిస్తున్నమో ?

  • బాహుబలి వినాయకుడు :

ఒక సినిమా మీద పిచ్చిని వినాయకునికి ఆపాదించి ,ఆ పేరుతో ఒక “వినాయకుని” రూపొందించడం ఎంత వరకు సమంజసం ?

సెల్ఫీ వినాయక :

సాంకేతికతలో ఒక పిచ్చిని వినాయకునికి ఎలా ఆపాదిస్తారు ?

క్రికెట్ వినాయక :

ఆటలో పిచ్చిని వినాయకునికి ఆపాదదిన్చడమా?

బైక్ వినాయక :

ఈ పైత్యాన్ని ఏమనాలో కూడా నాకు అర్ధం కాలేదు ….

వినాయకునికి సాలీడు రూపమా ?

తొండమునేకదంతమును తోరపు బొజ్జయును …

మెండుగా మ్రోగు గజ్జలను ,మెల్లని చూపులు మందహాసములు ..

కొండక గుజ్జు రూపమున ,కోరిన విద్యలకెల్ల నొజ్జఅయ్యి యుండెడి పార్వతీతనయా ,ఓయి గణాధిపా నీకు మ్రొక్కెద …

అని ఎంతో అందంగా మనం ఆరాధించాల్సిన వినాయకునికేల ఈ వికారాలు ,ఆలోచించండి  ఒక్క సారైనా …

మన హిందూ మతంలోని ఔచిత్యాన్ని ఎలాగు మరచిపోతున్నాము ,కనీసం అవమానించకుండా ఉండడానికి ప్రయత్నించలేమా????????

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s