నేరం-శిక్ష ఆడే ఆటే ఈ “జయసూర్య” …

https://i1.wp.com/andhraboxoffice.com/uploads/Jayasurya-201508150814111356791.jpg

కొన్ని సినిమాల్లో పెద్దగా కథ ఉండదు ,అయితే ఎంచుకున్న చిన్న అంశమే,మలుపులతో  ఆసక్తికరంగా చెప్పడం ఒక కళ,ముఖ్యంగా అపరాధ పరిశోధనకు సంబంధించిన కథలు,ఈ కోవకే చెందుతాయి ,కథలో కొంచం నీరసం కనిపించినా ,ఊహించిన మలుపులతో ఆకట్టుకునే సినిమాల్లో “జయసూర్య” ఒకటి …

కథ విషయానికి వస్తే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ,వ్యాపార వేత్తల హత్యలు ,కిడ్నాపులు జరుగుతుంటాయి ,ఈ హత్యలను భవానీ అనే రౌడీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అని అనుమానించిన పోలీసులు ,అతన్ని పట్టుకునే ప్రయత్నంలో ఆల్బర్ట్ అనే పోలీసు అధికారి, భవానీ చేతిలో హతమవుతాడు ,తనంతట తాను కోర్టులో లొంగిపోతాడు భవానీ ,అయితే అనూహ్యంగా అతని అనుచరులు అందరు జయసూర్యా (విశాల్) చేతిలో చంపబడుతూ ఉంటారు ,చివరికి భవానీ కూడా చంపే ప్రయత్నంలో తను ఒక “under cover” పోలీసు అని ప్రపంచానికి తెలియజేస్తాడు , అయితే భవానీ చావు కూడా వ్యాపారవేత్తల హత్యలను/అపహరణలను ఆపలేకపోతాయి,ఇది జయసూర్య కి ఒక సవాలుగా మారుతుంది ,ఆ సవాలును చేధించే క్రమంలో అపరాధి గురించి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది ,మరి తన లక్ష్యాన్ని జయసూర్య చేరుకున్నాడా లేదా అనేది మిగతా కథ ….

కథ చెప్పుకోవడానికి చాల సాధారణమైనదే అయినా కూడా ,అపరాధి పోలీసు అధికారి ఇంట్లోనే  ఉంటూ ,అతని నేరాలను కొనసాగించడం అనే పులి -మేక ఆట ఆసక్తికరంగా సాగుతుంది ప్రథమార్ధంలో కొంచం సేపు కథ ,కథానాయకుడు కాజల్ మధ్యన సాగే ప్రేమకథతో కొంచెం సేపు విసుగు కలిగించినా ,విశాల్ చేసే  encounter తో ఆసక్తికరంగా మారుతుంది ,విశ్రాంతి సన్నివేశానికే అపరాధి ఎవరు అనేది చూపించేసినా కూడా ద్వితీయార్ధంలో చట్టానికి అపరాధి ఎలా చిక్కుతాడు అనేది ఆసక్తికరంగా చూపించారు ,పతాక సన్నివేశానికి నిజాయితీ గల ఒక కుటుంభ పెద్ద తన ఇంట్లోనే ఒక హంతకుడు ఉన్నాడు అని తెల్సుకుని ఏ తండ్రీ ఇవ్వని తీర్పు ఇవ్వడం ఆకోట్టుకుంది ….

జయసూర్యాగా విశాల్ చక్కగా నటించారు ,కమీషన్ పేరుతొ రౌడీలతో పరిచయం పెంచుకుని ,encounter లో వారిని చంపెయ్యడం బాగుంది ,ఇక తన ఇంట్లోనే నేరస్తుడు ఉన్నాడని తెల్సుకుని బాధ పడే సన్నివేశాల్లో చక్కగా చేసారు …

కాజల్ గురించి మాట్లాడుకోవడం అనవసరం ,ఎందుకో ఈ సినిమాలో దర్శకుడు ఆమెకు సరైన పాత్ర ఇచ్చినట్లు అనిపించలేదు ,ఈమెతో విశాల్ ప్రేమాయణం కానీ హాస్యం కానీ పండలేదు …

సముద్రఖని పాత్ర బాగుంది ,గౌరవప్రదమైన కుటుంభంలో పుట్టి తన రాజకీయ కాంక్షలు తీర్చుకోవడం కోసం దుర్మార్గపు దారి ఎంచుకొనే పెద్దకొడుకు పాత్రలో ఇతను జీవించాడు …

ఎందుకో కానీ ఈ సారి దర్శకుడు సుశీంద్రన్ మరీ గంభీరమైన కథను ఎంచుకున్నాడు ,కథ ఆసాంతం అపరాధ పరిశోధన చుట్టూ తిప్పారు బాగానే ఉంది ,ముఖ్యంగా తప్పు చేసిన పెద్ద కొడుకు విషయంలో నిజాయీతి గల ఒక కుటుంభ పెద్ద ఇచ్చే తీర్పు న్యాయం అనిపించింది ,అయితే కథలో వినోదం పాలు బొత్తిగా లేకపోవడం ప్రతికూల అంశం ,ప్రథమార్ధంలో హాస్యం ఉన్నా పెద్దగా రుచించదు ….

ఇమాన్ సంగీతం బాలేదు ,నేపధ్యం మాత్రం బాగుంది….

మొత్తం మీద “వినోదం ” కోసం ఆలోచించకుండా ,ఆసక్తికరమైన ఒక విలక్షణ అపరాధ పరిశోధన చిత్రం చూడాలంటే తప్పక చూడొచ్చు ఈ “జయసూర్య” …

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s