“భలే భలే “వినోదం … భలే భలే మగాడివోయ్

https://i1.wp.com/www.thewiire.com/wp-content/uploads/2015/09/Bhale-Bhale-Magadivoy-First-Look.jpg

మారుతి ఈ పేరు నిన్న మొన్నటి వరకు “బూతు చిత్రాలకి ” పెట్టింది పేరు ,కుటుంభ ప్రేక్షకులు ఈ దర్శకుడి పేరు చెప్తే జడుసుకునేవారు  అప్పట్లో ,ఆ స్థాయి నుంచి నేటి తరంలో ఒక మంచి కథానాయకుడిగా పేరున్న “నాని” తో సినిమా అంటే ఇంకా సినిమా మీద ఆశ వదిలేస్కున్నారు నా లాంటి సగటు ప్రేక్షకులు చాలా మంది ,కాకపోతే మా లాంటి అంచానాలు తలక్రిందులు చేస్తూ 2 గంటల :20 నిమిషాలు ,చక్కటి కుటుంభ సమేతంగా చూడదగ్గ సినిమా అందించారు “మారుతి “…

కథ విషయానికి వస్తే లక్కీ (నానీ)  కి మతి మరుపు ఒక జబ్బులా ఉంటుంది ,తను ఏదైనా ఒక పని చేస్తూ వేరే దాంట్లోకి దిగితే మొదలెట్టిన పని మర్చిపోతాడు ,అలానే ఒక సందర్భంలో అతని తండ్రి నరేష్ కుదిర్చిన సంబంధం కోసం పాండు రంగా రావు (మురళీ శర్మ) ని కలవాలని అనుకుంటాడు ,అయితే అతనికున్న మతి మరుపు రోగం వల్ల పాండు రంగా రావు ని కలవలేకపోతాడు ,దానితో అతనికి శత్రువు అవుతాడు లక్కీ ,అయితే అనూహ్యంగా అతని కూతురి నందన (లావణ్యా త్రిపాఠీ) తోనే పీకల లోతు ప్రేమలో మునిగిపోతాడు ,ఈ స్థితిలో పాండురంగారావు స్నేహితుడు కొడుకు అజయ్ కూడా ఆమెను పొందాలని ప్రయత్నిస్తుంటాడు ,మరి ఇన్ని ప్రతికూల పరిస్థుతుల మధ్యన లక్కీ ప్రేమ ఎలా విజయ తీరాలకు చేరింది అనేది మిగతా కథ …

సాధారణ ప్రేమ కథే అయినా మతిమరుపు అంశాన్ని జోడించడం కథ పాత పుస్తాకానికి కొత్త ముఖ చిత్రం వేసినట్లు ఉంది ,వినోదం శాతం అస్సలు తగ్గలేదు ,వెకిలి హాస్యం లేకుండా ప్రేక్షకులు మనస్పూర్తిగా నవ్వేలా చేసారు మారుతి ,ప్రథమార్ధం అంతా లక్కీ మతి మరుపు ,అలాంటి వాడు ప్రేమించడం అనే అంశాలతో నవ్విస్తే ,ద్వితీయార్ధం హీరో ప్రేమను నిలబెట్టుకొనే ప్రయత్నాల్లో మరింతగా నవ్వించారు ,పతాక సన్నివేశాల్లో కొంచం కళ్ళు తడిచేసినా కూడా మళ్ళీ వెంటనే నవ్వించేసారు…

ఇక నటనా పరంగా చూస్తే మొదటిగా చెప్పుకోవాల్సింది కథానాయకుడు “నానీ” గురించి ,మతిమరుపు పాత్రలో హాస్యం పండించే ఒక ప్రేమికుడిగా చక్కగా నటించారు అనడం కన్నా ,జీవించారు అంటే బాగుంటుంది ,అవలీలగా చేసేసారు నానీ ఈ పాత్ర …

లావణ్యా త్రిపాఠీ ఈమెకు ఈ చిత్రం తెలుగు చిత్రం పరిశ్రమలో స్థానం పదిలం చేస్తుంది అని చెప్పొచ్చు ,అందం ,అభినయం ,చక్కటి నిడివి ఉన్న పాత్ర ఈమెకు దక్కింది …

ఇక మురళీ శర్మ పాత్ర కూడా చాలా చక్కగా రాస్కున్నారు దర్శకుడు ,మొదటి నుంచీ లక్కీని ద్వేషించే పాండురంగారావు పాత్రలో చక్కటి హావభావాలు పోషించారు ఇతను …

నరేష్ ,సితార ఈ పాత్రలు అలంకారప్రాయమే అయిన ఒకటి రెండు సన్నివేశాలు (ముఖ్యంగా మురళీశర్మ వీరి ఇంటికి వచ్చే సన్నివేశం,పార్టీ సన్నివేశం ) కడుపుబ్బ నవ్వించారు …

ఇక నందన ఛి కొట్టినా కూడా ఆమెను పొందాలని దేనికైనా తెగించే ప్రతినాయక పాత్రలో అజయ్ చాలా బాగా చేసారు …

నానీ చేసే పనులకు బాధ పడుతూ కూడా స్నేహ ధర్మంగా అతనకి సహాయం చేసే పాత్రల్లో ప్రవీణ్ ,వెన్నెల కిశోర్ చాలా చక్కగా చేసారు…

ఇక లక్కీ తీస్కోచ్చే గందరగోళాలతో ఇబ్బంది పడే పాత్రలో శ్రీనివాస రెడ్డి పాత్ర కూడా బాగుంది …

సంగీతం ,మాటలు ఇలా ప్రతీ విభాగం చాల కొత్తగా అద్భుతంగా ఉండేలా శ్రద్ధ తీస్కున్నారు మారుతీ ,అసలు టైటిల్స్ చూడకపోతే ఇది మారుతీ సినిమా అని గుర్తించడం కూడా కష్టమే ,ఇతని సినిమాల్లో చేసే చాలా రకాల కళాకారులని ప్రక్కన పెట్టి ,ఈ సారి సీనియర్ కళాకారుల బాట పట్టారు మారుతి ,ఇది కూడా అభినందించదగ్గ విషయమే ,మొత్తం మీదా హాయిగా నవ్వుకునే చిత్రాన్ని మనకిచ్చారు మారుతి …

కడుపుబ్బ నవ్వుకోవాడానికి ఇంటిల్లపాదితో ఎన్ని సార్లైనా “భలే ” భలే అనుకుంటూ చూడదగ్గ చిత్రమే ఈ భలే భలే మగాడివోయ్ … 🙂

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s