ఊరికోసం ఒక్కడు ఈ “శ్రీమంతుడు”…

https://i1.wp.com/www.ticket4u.in/upimages/movie/scaled/095407_Srimanthudu1.jpg

పల్లెటూళ్ళు దేశానికి పట్టుకొమ్మలు అనేవారట అప్పట్లో,అయితే రాను రాను ఉపాధి కోసం పట్టణాల బాట పట్టిన ప్రజలు ఆ మాటను మరిచి ,”జననీ జన్మ భూమీ ,స్వర్గాదపి గరీయసి ” అన్న మాట మరిచి ,ఇక తమ పుట్టిన ఊరినే మరచిపోతున్నారు ,అలాంటి వాళ్లకి ఒక సుతిమెత్తని వాత ,నేటి కాలంలో కూడా పల్లెలను ఎలా అభివృద్ధి పథంలో నిలపవచ్చో తెలిపాడు ఈ “శ్రీమంతుడు”…

ఇక కథ విషయానికి వస్తే హర్ష (మహేష్ బాబు ), కొన్ని వేల కోట్లకు అధిపతి అయిన రవి కాంత్  (జగపతిబాబు) కి ఒకే ఒక్క వారసుడు,తన వారసుడిగా తన వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ,తన కొడుక్కి అప్పగించాలనే రవికాంత్ ఆశ పడుతుంటాడు ,అయితే హర్ష ప్రపంచం వేరే,అతనికి తండ్రి వ్యాపారం మీద ఇష్టం ఉండదు ,హర్షకి ఒక ప్రేయసి చారుశీల(శ్రుతి హాసన్ ), అటు వంటి ఒక సందర్భంలో కేంద్ర మంత్రి(ముకేష్ రుషి ) ,అతని కొడుక్కి ఎదురెల్లి ,తండ్రికి ఒక టెండర్ సంపాదిస్తాడు ,ఆ తర్వాత తండ్రితో టూర్ అని చెప్పి దేవరకొండ అనే ఊరికి బయలుదేరతాడు ,ఆ ఊరిని తన దత్తతగా ప్రకటించి ,ఎన్నో మంచి పనులు చేస్తూ , ఆ ఊరిని గడగడలాడిస్తున్న శశి(సంపత్),కేంద్ర మంత్రుల ఆగడాలని అడ్డుకుని ఆ ఊరి ప్రజలకు ఆరాధ్య దైవం అవుతాడు హర్ష ,ఇంతకి దేవరకొండ కి హర్ష కి సంబంధం ఏమిటి ?చివరికి  వ్యాపారమే పరమావధిగా భావించే రవికాంత్ తన కొడుకు నిర్ణయాన్ని సమర్ధిస్తాడా ,అనేది అసలు కథ …

కధాంశం చాలా పాతది ,అంటే అప్పట్లో బాలయ్య బాబు ,కే.విశ్వనాద్ దర్శకత్వంలో చేసిన “జననీ జన్మభూమి ” అనే చిత్రం అప్పటిది ,అయితే సినిమాను ,ఇప్పటి తరం ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఎంతో చక్కగా తీసారనే చెప్పాలి ,ఎక్కడా విసుగు ఉండదు ,ప్రథమార్ధం మొత్తం కథానాయకుడు అతని తండ్రి మధ్యన జరిగే సన్నివేశాలు ,ఇంకా శ్రుతి హాసన్ తో నడిచే ప్రేమ సన్నివేశాలు ,చాలా చక్కగా ఉన్నాయి ,వినోదం బాగుంది ,ఇక కథానాయకుడు దేవరకొండకు బయలుదేరడంతో కథ విశ్రాంతికి చేరుతుంది ,అలుపెరుగని యోధుడిగా కథానాయకుడి పోరాటం ,ఊరిని అభివృద్ధి చేయడం ,ఊరి శత్రువుల ఆట కట్టించడం ,రవికాంత్ లో మార్పు తీస్కురావడంతో కథ ముగుస్తుంది …

మహేష్ బాబు నటన చాలా చాలా కొత్తగా ఉంది ,ఎంతో హుందాగా ,ఆశయం కోసం శ్రమించే యువకుడిగా ,తండ్రిని గౌరవించే కొడుకుగా ,చక్కటి ప్రేమికుడిగా ,ఒక్కటేమిటి ఇలాంటి మంచి పాత్ర కుదరడం విశేషమే ,సినిమా అంతా తనే కనిపించినా కూడా ఎక్కడ విసుగు అనిపించదు ,అంత అందంగా ఉన్నారు ,అసలే అందంగా ఉన్న ఈయనని దర్శకుడు కొరటాల శివ,చాయాగ్రాహకుడు మది మరింత ఆకర్షణీయంగా చూపించారు …

ఇక మహేష్ బాబు తర్వాత చెప్పాలంటే ఈ సినిమాలో అతి ముఖ్యమైన పాత్ర జగపతిబాబు ,ఇతని పాత్ర చాల హుందాగా ఉంది ,కొడుకు భవిష్యత్ కోసం తండ్రి పడే ఆరాటంలో  చక్కటి ఆర్ద్రత కనబరిచారు .చాలా అందంగా కూడా ఉన్నారు ఈయన ,బహుశా తెల్ల గెడ్డం లేకపోతే మహేష్ బాబు కి అన్నగా కూడా చేసేయొచ్చు ఈయన …

ఊరి పెద్ద నారాయణరావు గా   రాజేంద్రప్రసాద్ పాత్ర ఎంతో బాగుంది ,ఊరిలో ఒకొక్క కుటుంభం వెళ్లిపోతుంటే ,వారి కోసం కంటనీరు పెట్టుకునే మంచి పాత్రలో అలవోకగా నటించారు …

ప్రతినాయకుడిగా చేసిన సంపత్ చాలా చక్కగా చేసారు ,ముఖంలో క్రౌర్యం ఆ హావభావాలు అద్బుతం …

శృతి హాసన్ నటన బాగుంది ,ఆమె ఒక ప్రేయసిగా ,హర్షను అపార్ధం చేస్కునే ఒక అమాయకపు పాత్రలో బాగుంది ,అందంగా కనిపించింది కూడా …

ఇక వెన్నెల కిశోర్ ,ఆలీ ,సుబ్బరాజు వారి వారి పాత్రల మేరకు బాగానే చేసారు …

దర్శకుడు కొరటాల శివ చాల చక్కటి కధాంశం ఎంచుకున్నారు,ఊరిని దత్తత అనే అంశంతో మంచి సందేశం,తండ్రి కొడుకుల అనుబంధాన్ని ,కుటుంభ విలువల్ని చక్కగా చూపించారు ,ఈ ప్రయత్నంలో ఎక్కడా వ్యాపార సూత్రాలను వదలలేదు ఈయన , ఎక్కడా  అశ్లీలత లేకుండా జాగ్రత్త పడ్డారు ,కాకపోతే  సినిమా నిడివిని కొంచం కుదిస్తే బాగుండేది (ముఖ్యంగా ప్రధమార్ధం ),మిగతా అంతా అద్భుతం ,మహేష్ కి నటన పరంగా ,కాసుల పరంగా కూడా ఈ చిత్రం అద్భుతమే …

దేవిశ్రీప్రసాద్ సంగీతానికి పేరు పెట్టలేం …అన్ని పాటలు బాగున్నాయి ,నేపధ్యం అత్యద్భుతం ….

అనల్ అరసు పోరాటాలు చాలా బాగున్నాయి …ప్రతీ పోరాట సన్నివేశం మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేటంత బాగుంది …

ఇక మది చాయాగ్రహణం చాలా బాగుంది ,ప్రతి సన్నివేశాన్ని ,పాటని ,ముఖ్యంగా పోరాటాలని వర్నరంజితంగా అలరించారు ….

మొత్తంగా చెప్పాలంటే మళ్ళీ మళ్ళీ మళ్ళీ చూడదగ్గ సినిమా ఈ “శ్రీమంతుడు “….

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s