“మట్టి పళ్ళెం -బంగారు గోడ “,అనిపించిన “బాహుబలి “

https://i2.wp.com/www.skyhdwallpaper.com/wp-content/uploads/2015/07/baahubali-Movie-10.jpg

ఉపోద్ఘాతం :

  • మీరు ఒక పెళ్ళికి వెళ్ళారు ,పెళ్ళిలో అలంకరణలు ,హంగులు ,ఆర్భాటాలు ,విందులు ,వినోదాలు అన్ని ఏర్పాటు చేసారు పెళ్లి వాళ్ళు ,కాని పెళ్లి కొడుకు ,పెళ్లి కూతురికి తాళి కట్టలేదు ,అపుడు మీకు అనిపించేది ఏమిటి?
  • మీ స్నేహితుడు మిమ్మల్ని ఒక పెద్ద హోటల్ కి విందు ఇస్తాను అని తీస్కెల్లాడు ,తీరా ఆ విందు అయ్యాక పర్సు లేదురా అంటే ?మీకు ఏమి అనిపిస్తుంది ?

ఈ రెండు ఉదాహరణల సారాంశమే ఈ “బాహుబలి” చూసాక మీకు కలిగే భావాల సమాహారం …

ఇక మన భారతీయుల్లో మరీ ముఖ్యంగా తెలుగు వారిలో జానపద చిత్రాలు మెచ్చని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో ,నాటి తరంలో పాతాల  శ్రీ .ఎన్టీఆర్ ,కాంతా రావు గారు ,ఆ తర్వాత తరం లో నందమూరి బాలకృష్ణ భైరవ ద్వీపం తరువాత ,ఈ చిత్రాలను తీయడానికి పెద్దగా ఎవరూ సాహసించిన దాఖలాలు లేవని చెప్పవచ్చు ,కానీ నేటి తరం దర్శకుల్లో “విజయాన్నే” తన ఇంటి పేరుగా మలుచుకున్న రాజమౌళి గారు ఇటు వంటి ఒక భారీ జానపద చిత్రం తీయాలి అనుకోవడం అభినందించదగ్గ విషయం ..మరి మూడు సంవత్సరాలు పై చిలుకు సమయం తీస్కుని ,సుమారుగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసును దోచుకుందా అంటే సూటిగా సమాధానం చెప్పడం కష్టమే …

ఇక కథ విషయానికి వస్తే అనగనగా శివగామి (రమ్యకృష్ణ) అనే మహారాణి గారు ,చేతిలో ఒక బిడ్డతో తరుముతున్న సైన్యం నుంచి తప్పించుకుని ఒక నదిలో దూకి ,బాహుబలి (ప్రభాస్) అనబడే ఆ బిడ్డను ఒక గుడానికి చేర్చి కన్ను మూస్తుంది ,అక్కడ ఆ బిడ్డను కోయదొర భార్య (రోహిణి ) ప్రేమగా సాకుతుంది ,కొంచం పెరిగి పెద్దయ్యాక ఒక కొండను ఎక్కే ప్రయత్నంలో ,అవంతిక (తమన్నా) ని చూసి ప్రేమలో పడిపోతాడు బాహుబలి  ,అన్యాయంగా బల్లాల దేవుడు (రానా) అనే క్రూరుడు అనే రోజు చెర నుంచి ,దేవసేన (అనుష్క) అనే స్త్రీ ని రక్షించడం అనే నినాదంతో పని చేసే కొంత మందితో కలిసి పని చేస్తుంది ఈ అవంతిక ,ఆమెను ప్రేమించడంతో ఆమె లక్ష్యాన్ని తనది చేసుకుంటాడు బాహుబలి ,దేవసేనని రక్షించే క్రమంలో కొన్ని ఆసక్తికరమైన నిజాలు బయటపడతాయి ,మరి అసలు దేవసేన ఎవరు ?ఆమెకు బాహుబలికి సంబంధం ఏమిటి ?చివరకు బాహుబలి దేవసేన ని రక్షిస్తాడా అనేది మిగతా కథ …

చెప్పుకుంతూ పొతే నాటి రాజసింహ నుంచి ఆమధ్యన భైరవ ద్వీపం వరకు కొంచం మార్పులతో ఇదే కథ బహుశా ఈ తరం వారికి “చందమామ ” కథల పుస్తకం చదివే అలవాటు లేదు కనుక ,e-books రూపంలో చదివినా కూడా దర్శకుడు తీయాలని ఆశిస్తున్న “బాహుబలి ” రెండో భాగం కథను ఊహించడం పిజ్జాతో పెట్టిన విద్య అనవొచ్చు …

దర్శకుడు రాజమౌళి ముందే చెప్పినట్లు ఆయన దగ్గర పాత్రలు ఉన్నాయి కానీ కథ లేదు ,ఆ పాత్రలను అన్నీ కలుపుకుని కథ తయారు చేస్కున్నారు ,ఆ అతుకుల బొంత వ్యవహారం స్పష్టంగా ,కొట్టొచ్చినట్లుగా కనిపించింది ఈ బాహుబలి లో …

అయితే కథ ఎలాంటిది అయినా ,దర్శకుడు సినిమాను భారీగా కాదు కాదు అతి భారిగా ,న,భూతో ,న భవిష్యత్ అన్న చందాన తెరకెక్కించారు ,సినిమాలో నిర్మాత పెట్టిన ప్రతి రూపాయి వెండితెర మీద కోటి రెట్లు అందంగా కనిపించింది ,చివరి అరగంటలో వచ్చే యుద్ద సన్నివేశాలు అద్భుతం కాదు ,మహోద్భుతమే …

అయితే సినిమాలో కథ లేదు ,పాత్ర ఎంత అందమైనా ,వట్టి పాత్రను కొరుక్కు తినలేము కదా ,దాంట్లో అన్నమో ,ఫలమో ఉంటేనే ఆ పాత్రకి విలువ ,ఇది అంతే ,ఈ గ్రాఫిక్స్ మాయాజాలంలో పడి కథా,కథనాన్ని పూర్తిగా అటక ఎక్కించారు రాజమౌళి గారు …

ముఖ్యంగా నటీ నటుల ఎంపికలో చాలా లోపాలు ఉన్నాయి ,

ప్రభాస్ దగ్గరి నుంచి మొదలు పెడితే ,కేవలం ఇతని శరీర సౌష్టవం చూసే ఇతన్ని ఎంచుకున్నారు ,ఆ పరంగా ఇతను పర్లేదు ,అయితే సుమారుగా 13 ఏళ్ళ నుంచి నటిస్తున్నా ,ఇతని నటన కానీ ,సంభాషణ పలికే విధానంలో కానీ కొత్తదనం శూన్యం …

తమన్నా కేవలం దర్శకుడు ఈమె నడుము చూపించడానికే ఎంచుకున్నాడా అనిపించింది ,ఈమె యుద్ద విద్యలు బాగానే చేసింది ,అయితే ప్రేక్షకులు ఆమె నుంచి ఏమి ఆశిస్తారో దర్శకుడికి తెల్సు కనుక ,ఒక పాట(అందులో మీరు ఊహించిందే ఉంటుంది ) పెట్టి ఆమె పాత్రను దాదాపుగా అవగోట్టేసారు …

బాహుబలి రెండో భాగం లోఎలా ఉంటుందో కానీ ,మరి ప్రథమార్ధంలో ఆ దేవసేన పాత్రకు అనుష్కానే ఎందుకు ఎంచుకున్నారు అంటే చెప్పడం అసాధ్యం ,ఆ పాత్ర మొహం చూపించేదే తక్కువ కనుక ,ఆమె పాత్ర ఔచిత్యం ఏంటి అంటే మరి అనుమానమే ….బహుసా ద్వితీయ భాగంలో ఈమెను చూపిస్తారేమో ….

ఇక రానా ,క్రూరత్వం ,రౌద్రం అతని శరీర సౌష్టవానికి చాల చక్కగా అమిరాయి ,అయితే నటనలో కొన్ని చోట్ల తోనికారు ఈయాన కూడా …

అడివి శేష్ మిగతా సినిమాల్లో బాగానే చేసారు కానీ ,ఈ సినిమాలో ఇలాంటి పాత్రకు అమరలేకపోయారు ….

నాజర్ ఎదావిధిగానే బాగా చేసారు …

ఇక బాహుబలి మొత్తానికి చక్కటి నటన ఎవరిదంటే కేవలం శివగామి పాత్రధారి రమ్యకృష్ణ మాత్రమె ,అప్పట్లో నరసింహ సినిమాలో నీలాంబరి పాత్ర తర్వాతా అంతటి శక్తి వంతమైన పాత్ర ఇచ్చారు శివగామిగా ఈమెకు …

కట్టప్పగా సత్యరాజ్ ఎదావిదిగా చక్కగా చేసారు ,అయితే ఈ పాత్ర రాస్కున్న దర్శకుడు తికమక పడినటు అనిపించింది ,కాసేపు ఇతన్ని విశ్వాసినికి ప్రతినిధిగా ,ఇంకాసేపు రాజద్రోహం చేసే వ్యక్తిలా చూపించడం లోని ఆంతర్యం రచయిత ,దర్శకులకే ఎరుక …

కాలకేతుగా చేసిన ప్రభాకర్ ,క్రూరత్వం బాగానే పండించారు గాని ,ఆ పాత్ర మాట్లాడే ఆ పిచ్చి భాషకు ఒక దండం పెడతారు మనలాంటి ప్రేక్షకులు …

దర్శకుడు రాజమౌళి గారి మీద హాలీవుడ్ ప్రభావం చాలా ఎక్కువే అని మరోసారి నిరూపించుకున్నారు ,కథలో బిగి లేదు ,ఎంత సేపు ,కథానాయకుడు ప్రభాస్ కండలు ,ప్రతినాయకుడు రానా కండలు చూపించడం మీదే శ్రద్ధ పెట్టారు ,మాహిష్మతిని బాగా చూపించారు ,కన్నులకు పండగగా తీసారు ఈ బాహుబలిని ,అయితే కథ లేకుండా విసిగించారు …

కీరవాణి స్వర సారధ్యంలో పాటలు ఓహో అనలేము కానీ పర్వాలేదు ,నేపధ్యం కొన్ని చోట్ల సరిగా లేదు …

గ్రాఫిక్స్ మాత్రం పేరు పెట్టడం కష్టం ,బహుశా గ్రాఫిక్స్ విషయంలో మాత్రం “బాహుబలి ” కి ముందు “బాహుబలి” కి తర్వాతా అనాల్సిందే …

ఇక చివరిగా చెప్పాలంటే మీరు భారీతనం ఆశించే ప్రేక్షకులు అయితే తప్పక చూడొచ్చు ఈ సినిమాని ,కాకపోతే కథ,సినిమా నిడివి ఈ రెండు అస్సలు పట్టించుకోకూడదు …బంగారు పళ్ళానికి,మట్టి గోడ ఆధారం అన్నారు కానీ ,పళ్ళెం మట్టిది అయితే గోడ బంగారమే కావాల్సిన అవసరం ఉంది అంటారా ?

ముఖ్య గమనిక :ఇది నేను ఒక సగటు ప్రేక్షకుడిగా చూసి రాసింది ,తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీస్కుని వెళ్తుంటే ,మా లాంటి వాళ్ళు విమర్శ చేస్తున్నారని ,ఆడి పోసుకుంటున్నారనే వారి కోసమే ఈ సినిమాని చూసి రాస్తున్నా ,కథ లేకుండా ,కేవలం గ్రాఫిక్స్ మీదే విజయం సాధించిన హాలీవుడ్  చిత్రం ఏది ఒక్కటి చూపిద్దురూ?సినిమాలో విషయం లేకుండా కొన్ని పాత్రలు కలిపేసి ,దానికి భారీతనం అద్దేసి,దాన్నే 21 వ శతాబ్దపు పాతాళ భైరవి అనుకోమనడం న్యాయమా ?సినిమా టికెట్ ధర పెంచేసి ,మీ కలెక్షన్స్ మొదటి రోజు 65 కోట్లు చూపించుకోవడం ఎలా న్యాయం?అతి సర్వత్ర వర్జయేత్ …

ప్రకటనలు

5 thoughts on ““మట్టి పళ్ళెం -బంగారు గోడ “,అనిపించిన “బాహుబలి “

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s