ఈ “రఘువరన్ B.Tech” హీరో …

పొరుగింటి పుల్ల కూర రుచి అంటారు కానీ ,విలక్షణమైన కథా ,కథనాల్లో తమిళులు ముందు ఉంటారు …సగటు ప్రేక్షకులు ఆలోచించడానికి కూడా ఇష్టపడని అంశాలు ఎంచుకుని వీళ్ళు విజయం సాధిస్తుంటారు ..అలాంటి ఒక విలక్షణ ,వినోదాత్మక చిత్రమే ఈ “రఘువరన్  B.Tech”…

ఇక కథ విషయానికి వస్తే సివిల్ ఇంజనీరింగ్ చదివిన “రఘువరన్ (ధనుష్ )” తన చదువుకు సంబంధించిన ఉద్యోగం వచ్చే వరకు  ఇంటర్వ్యూలకు వెళ్తూ ,ఇంట్లో తండ్రితో (సముద్ర ఖని )తిట్లు తింటుంటాడు ,ఇంకా పక్కింట్లో ఉండే అమలా పాల్ తో ప్రేమలో పడతాడు ,అనుకోకుండా అతని తల్లి (శరణ్య) చనిపోతుంది ,దానితో క్రుంగిపోయిన రఘువరన్,క్రమంగా కోలుకుంటాడు ,ఒక ప్రముఖ భవన నిర్మాణ సంస్థలో ఉద్యోగిగా చేరి ,ప్రభుత్వం మురికి వాడలు నిర్మూలనకు తలపెట్టిన ,ఒక ప్రాజెక్ట్ని తన కంపెనీలో చేబడతాడు ,అయితే ఈ ప్రయత్నంలో రాష్ట్రంలో ప్రముఖ భవన నిర్మాణ వేత్తతో డీకొంటాడు ,మరి ఆ ప్రయత్నంలో అతను విజయం సాధించాడా అనేది మిగతా కథ ..

కథ మొత్తం ఇంజనీరింగ్ విద్యార్థుల చుట్టూ అల్లుకున్నాడు దర్శకుడు ,అదే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ ,లక్షల్లో ప్రతి సంవత్సరం విద్యార్థులు బయటకి వస్తున్నారు ,వాళ్ళందరి శక్తి ఉపయోగించుకుంటే సమాజానికి ఎలా మంచి చేయాచ్చో మనసుకి హత్తుకునేలా చెప్పాడు దర్శకుడు …

ప్రథమార్ధం చాలా సాధారణంగా చూపించారు ధనుష్ ని ,మన పక్కింట్లో ,ఎదురింట్లో ,చుట్టూపక్కల ,ఎందుకు మన జీవితాల్లోనే నిరుద్యోగిగా ఉన్నప్పుడు ,సమాజం ,తల్లి తండ్రులు చేసే అవహేళనలు కళ్ళకు కట్టినట్లు చూపించారు ,ధనుష్ కూడా ఈ పాత్ర చక్కగా చేసాడు ,అతని పాత్ర,,ఆహార్యం ,వస్త్రధారణ అన్నీ కూడా చాలా సహజంగా ఉన్నాయి ,చక్కగా చేసారు …

ద్వితీయార్ధం అత్యద్భుతం అనే చెప్పొచ్చు ,యువ శక్తికీ ,అహంకారి అయిన ఒక పారిశ్రామిక వేత్తకు జరిగీ యుద్ధం ప్రేక్షకులతో ఈలలు వేయించింది …

దర్శకుడు వేల్ రాజ్ ఎంచుకున్న అంశం సందేశాత్మ్కమే ,కానీ చేదు మాత్రకు ,తేనె పూత పూసాడు ,ఎక్కడా విసుగు (ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు మినహా ) కలగకుండా జాగ్రత్తపడ్డాడు ,కథానాయకుడి తల్లి పాత్రను చంపెయ్యడం మాత్రం చిరాకు తెప్పిస్తుంది ,కథకు ఇది అంత అవసరమా అనిపించింది ..మిగతా చిత్రం మాత్రం చాలా చక్కగా తీసాడు …

అమలా పాల్  పాత్ర బాగుంది ,గడసరి పక్కింటి అమ్మాయిగా ,ఈమె పాత్ర చిత్రణ బాగుంది ,కానీ ఈ పాత్ర ద్వితీయార్ధంలో చాలా తక్కువ సేపు కనిపించడం కొంచం ప్రతికూల అంశమే ..

మధ్యతరగతి తండ్రిగా సముద్రఖని పాత్ర బాగుంది ,కొడుకు మీద ప్రేమ ఉండి కూడా ,కొడుకు భవిష్యత్తు కోసం అతన్ని తిడుతూ బాధపడే తండ్రిగా పాత్ర అత్యంత సహజంగా చేసారు ..

తల్లిగా శరణ్య పాత్ర కూడా బాగుంది .,.

ఇంకా ధనుష్ కి తమ్ముడిగా చేసిన హ్రిషికేశ్ ,తన పాత్ర మేరకు నటించాడు ..

ఇంకా ద్వితీయార్ధంలో “వివేక్” చక్కని హాస్యాన్ని పండించారు …

“అమితాష్ ప్రాధాన్ ” ప్రతినాయకుడిగా మంచి నటన కనబరిచారు …

“అనిరుథ్” స్వర సారధ్యంలో పాటలు ,నేపధ్య సంగీతం రెండూ బాగున్నాయి ,ముఖ్యంగా ద్వితీయార్ధంలో నేపధ్య సంగీతాన్ని మెచ్చుకోకుండా ఉండలేం …

“కిషోర్ తిరుమల ” చక్కటి సంభాషణలు రచించారు ,ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థుల మీద ఇతను రాసిన సంభాషణలు అత్యధ్బుతం…

మొత్తం మీద చెప్పాలంటే యువ శక్తి,తలుచుకుంటే సమాజాన్ని ఎలా మార్చేయోచ్చో వినోదాత్మకంగా చూపించారు ,తప్పక చూడదగ్గ చిత్రం ఈ “రఘువరన్ B.Tech”…

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s