బంధాలు,అనుబంధాల విలువలతో “గ్రీకు వీరుడు”

 greeku-veerudu-widescreen2

 

 

 

 

 

 

 

 

 

దర్శకుడు దశరధ్ తన చేసిన ప్రతి సినిమా లోనూ “కుటుంభ సంబంధాలను” “భావోద్వేగాలను” చక్కగా చూపిస్తారు ..తన మొదటి చిత్రం “సంతోషం ” నుంచి ఇదే పద్ధతిలో అయన సినిమాలు తీస్తూ కుటుంభ ప్రేక్షకులకు దగ్గర అయ్యారు… అలాంటిది తను చేసిన మొదటి చిత్రం కథా నాయకుడు అయిన నాగార్జునతో సుమారుగా 11 ఏళ్ళ తర్వాత “గ్రీకు వీరుడు” సినిమా రావడం తో ఎన్నో అంచనాలు పెరిగాయి.. ఆ అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా సాగింది ఈ “గ్రీకు వీరుడు”…

ఇక కథ విషయానికి వస్తే “ప్రేమ” “సంబంధాలు ” అనేవి వట్టి బూటకాలు అని, కేవలం ఆడ మగ మధ్యన శారీరిక సంతోషమే ప్రధానం అని నమ్మే యువకుడికి,కుటుంభంలోని ఆప్యాయతలు ,మనుషుల మధ్యన సంబంధాలు ఎలా తెలిసాయి?తను ప్రేమించిన అమ్మాయి మనసుని చివరికి ఎలా గెల్చుకున్నాడు అనేది క్లుప్తంగా కథ….

సహజంగా మన తెలుగు సినిమాల్లో ఉండే కుటుంభ విలువలు ఇవన్ని ఈ మధ్యన తగ్గాయి,ఇలాంటి సినిమాలకు మహారాణి పోషకులైన  స్త్రీలు టీవీ ధారావాహికలకు అతుక్కుపోవడం వల్ల  సహజంగా ఈరోజుల్లో ప్రేమ లేదంటే వినోద ప్రధానమైన చిత్రాలు మాత్రమే వస్తున్నాయి… అటు వంటి రోజుల్లో ఇలాంటి ఒక కుటుంభ కథా చిత్రాన్ని తియ్యాలని దశరధ్ సంకల్పించడం నిజంగా కత్తి మీద సామే…

ప్రధమార్ధంలో ఎక్కువగా కుటుంభ సంబంధాల గురించి దర్శకుడు ద్రుష్టి పెట్టడం వల్ల,వినోదం మోతాదు కొంచం తగ్గినట్లు అనిపించింది… ద్వితీయార్ధంలో మాత్రం వినోదాన్ని బాగానే చూపించగలిగారు 

ఈ సినిమాకి పెట్టిన పేరు “గ్రీకు వీరుడు”, దానికి కథకు ఏమాత్రం సంబంధం లేదు కాని “నాగార్జున”  మాత్రం ఆ పదానికి సరిగ్గా సరిపోయారు.. అయన కేశాలంకరణ,మీసకట్టు ,సహజ సిద్ధమైన ఆకర్షణ ఇవన్ని కల్సి ఆయన్ని నేటి తరం కధానాయకుల తో పోటీ పడేలా చేసాయి… ఈ “మన్మధుడి”కి 50 సంవత్సరాలు పైబడ్డాయి అంటే నమ్మడం కష్టమే …

ఇక నయన  తార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ,సహజ సిద్ధమైన తన అందం ,అభినయం తో “కథానాయకి ” పాత్రకు చక్కని న్యాయం చేసింది… నాగార్జున పక్కన చక్కటి జోడీ  అనిపించింది …  ఇలాంటి మంచి పాత్రలు పోషించగల సత్తా ఉన్న నేటి తరం నటుల్లో(అతి తక్కువ మందిలో) నాయనతార కచ్చితంగా ఒకరు అని చెప్పొచ్చు 

ఇక వయసు మళ్ళిన తాత పాత్ర అనగానే దశరద్ గారికి కే.విశ్వనాధ్ గారినే పెట్టుకోవడం ఆనవాయితీ గా మారింది… అయన కూడా పర బాషా నటుల్లాగా అతి నటన కాకుండా మన ఇంట్లో ఉండే ఒక తాత లాగానే చక్కగా నటించారు…

ఇక కధానాయకుడి పక్కనే ఉండే “మామ” పాత్రలో M.S  నారాయణ చక్కటి హాస్యం పండించారు.. కోవై సరళ తో ఈయన హాస్యం కొంచం అతిగా అనిపించినా కూడా బానే ఉంది అనిపించింది… ఇక కోవై సరళతో ఆ రకమైన హాస్యం చేయించడం  మన దర్శకులు ఎప్పుడు మానేస్తారో చూడాలి…

ఇల్లరికపు అళ్ళుళ్ళుగా రఘుబాబు ,కాశీ  విశ్వనాధ్ బాగా చేసారు,కానీ  వీరు ప్రతీ చిత్రంలో ఇవే పాత్రలూ  పోషించడం వాళ్ళ ప్రేక్షకులకు మొహం మొత్తే ప్రమాదం లేకపోలేదు…

కే.విశ్వనాధ్ విరోధిగా కోటా శ్రీనివాసరావు గారి పాత్ర చిన్నదే అయిన,చక్కగా తీర్చిదిద్దారు…

ఇక బ్రహ్మానందం లేకపోతే సినిమా ఆడదు అనే ఒక రకమైన భావన ఉండిపోవడం వల్ల  దర్శకుడు బలవంతంగా అతని పాత్రను కథలోకి ఇరికించినట్లు  అనిపించింది,తప్పితే అతని హాస్యం లో కొత్తదనం అయితే ఏమి కనపడలేదు 

సినిమా మొత్తం మీద అత్యంత పేలవమైన నటన కనబరిచిన  నటి ఎవరంటే మాత్రం “మీరా చోప్రా” పేరు కచ్చితంగా చెప్పొచ్చు,ఈమెకు మొహంలో పెద్దగా భావాలు పలికించడం ఎక్కడా వచ్చినట్లు కనిపించలేదు… అసలు ఆ పాత్ర తీర్చి దిద్దిన విధానమే బాగులేదు… నాగార్జునకి తనకి ఉన్న సంబంధం కేవలం శారీరిక సంబంధమే అని తెల్సిపోయి కూడా,తను డబ్బు కోసమే ముసలి బ్రహ్మానందాన్ని పెళ్లి చేస్కుంటూ కూడా మళ్ళీ నాగార్జున దగ్గరికి వచ్చేసి తనని పెళ్లి చేస్కోమని అడగడం విడ్డూరమైతే ,అందుకు ఒప్పుకోలేదని నాగార్జున మీద  పగ తీర్చుకోవడం మరీ విడ్డూరంగా తోచింది…  

ఇక ఆశిష్ విద్యార్థి కధానాయకుడికి విరోధిగా ,కదా నాయకి సోదరుడుగా ఒక మంచి పాత్రే చేసారు అని చెప్పొచ్చు…

తమన్ సంగీతం ,ఇంకా నేపధ్య సంగీతం కూడా బాగుంది…

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనం కోల్పోతున్న అనుబంధాలని,ప్రేమ అనే బంధం ఎంత గొప్పదో తెలియ జెప్పిన ఒక చక్కటి చిత్రం “గ్రీకు వీరుడు”….

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s